సత్యసాయి: గోరంట్ల మండలంలోని 4వ వార్డులో మిక్చర్ బాషా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న గోరంట్ల మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి వారి ఇంటికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాషా ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్థించినట్లు విద్యాధరణి తెలిపారు.