WGL: రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఇవాళ పున:ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. నేడు క్వింటా పత్తి ధర రూ. 6,880 పలికినట్లు పేర్కొన్నారు. పత్తి ధరలు రోజురోజుకు పడిపోతుండడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.