భారత మహిళా క్రీడాకారులు ఇటీవల కాలంలో సంచలనాలు సృష్టిస్తున్నారు. క్రికెట్లో వన్డే ప్రపంచకప్‌తో పాటు అందుల T20 WC గెలిచిన భారత మహిళలు తాజాగా మరో అద్భుత విజయాన్ని అందుకున్నారు. బంగ్లాదేశ్‌లో జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్లో బలమైన చైనీస్ తైపీ జట్టును 35-28 తేడాతో చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది.