NZB: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఇవాళ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల అర్జీలను స్వీకరించి, వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత సీఐలు, ఎస్సైలతో ఫోన్లో మాట్లాడారు.