AKP: ఎస్.రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ దార్లపూడి పంచాయతీలో సోమవారం పర్యటించారు. క్లోరినేషన్ చేసిన తాగునీరు వస్తుందా లేదా అని మహిళలను అడిగి తెలుసుకున్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి వేసిన పైపు లైన్ల నుంచి త్వరగా మంచినీరు సరఫరా చేయాలని మహిళలు ఎంపీడీవోను కోరారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు.