NDL: శ్రీశైలం మల్లన్న భక్తులు వసతి, ఇతర ఆర్జిత సేవలు కోసం దేవాదాయశాఖ, దేవస్థానం అధికారిక వెబ్సైట్లను వినియోగించాలని ఛైర్మన్ రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు సూచించారు. నకిలీ వెబ్సైట్ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా ముందస్తు బుకింగ్ కోసం వెబ్సైట్ www.aptemples.ap.gov.in, www.srisailadevasthanam.org వినియోగించుకోవాలన్నారు.