ఆదిలాబాద్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశారు. అదిలాబాద్ నియోజకవర్గంలో రాజకీయ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు అవకాశం కల్పించాలని ఆయనను కోరారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.