NZB: నిబంధనలకు విరుద్ధంగా ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి నియామకాన్ని చేపట్టారని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్యదర్శిగా నియమించిన సీతయ్య ఇప్పటికే రెండు పర్యాయాలు విధులు నిర్వహించారన్నారు.