KNR: ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీలు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ నగరపాలక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి 352 దరఖాస్తులు స్వీకరించారు.