HYD: నగరంలో పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు అత్యవసర మందుల కోసం అవస్థలు పడుతున్నాయి. నీలోఫర్, MNJ క్యాన్సర్ హాస్పిటల్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు అత్యవసర రోగులకు మందులు అందించలేక పోతున్నాయి. నిధుల కొరతతో ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.300 కోట్ల నిధులు జాప్యంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు.