RR: ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం ఫరూఖ్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ, స్కూల్లో మరమ్మతుల పనుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ.40 లక్షల హెచ్ఎండీఏ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.