SKLM: నరసన్నపేట మండలం పాలకొండ పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎంఈవో- 2 పేడాడ దాలినాయుడు ఆకస్మికంగా పరిశీలించారు. ఇవాళ స్థానిక పాఠశాలలను పరిశీలించిన ఆయన విద్యార్థుల హాజరు శతశాతం ఉండే విధంగా కృషి చేయాలని ఉపాధ్యాయుడు బి వీర్రాజుకు సూచించారు. తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థుల సామర్థ్యాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.