BHPL: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష ఇవాళ్టీకి మూడో రోజుకు చేరింది. పట్టాలు అందుకున్న 37 మంది జర్నలిస్టులకు స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. వారు గతంలో ఇచ్చిన పట్టాలు పట్టుకుని నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. సమస్య పరిష్కారం కాకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.