అన్నమయ్య: ఒంటిమిట్టలోని జడ్పీహెచ్ఎస్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి దాటుతున్న ఒంటిమిట్టకు చెందిన శేఖర్‌ను కడప నుంచి తిరుపతి వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో శేఖర్ గాయపడగా, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కు తరలించారు.