భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్తో జరగాల్సిన వివాహం వాయిదా పడింది. అయితే, తాజాగా పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురయ్యాడు. వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీ బారిన పడినట్లు సమాచారం. అతడిని ఆసుపత్రికి తరలించినట్లు వారి సన్నిహితులు వెల్లడించారు.