అనంతపురం: గుంతకల్లు పట్టణంలోని డీఎంఎం రైల్వే గేటు వద్ద పట్టాలపై ఓ గుర్తు తెలియని మహిళ సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.