చిన్న సినిమాగా వచ్చి అభిమానులను అలరిస్తున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ఈవెన్ సాధించింది. దేశవ్యాప్తంగా మూడు రోజుల్లోనే రూ.7.28 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. అలాగే రోజురోజుకూ వసూళ్లు పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని ఓ పల్లెటూరులో సాగే ఈ ప్రేమ కథా చిత్రంలో అఖిల్, తేజస్విని జంటగా నటించారు.