GDWL: అలంపూర్ మండలం గొందిమల్ల గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు స్వాములు నాయుడు ప్రారంభించి మహిళలకు చీరలను అందించారు. గ్రామ మహిళలు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్నలాగా చీరలు పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు.