SRPT: మద్దిరాల మండలం గుమ్మడవెల్లిలో ఇందిరా మహిళా శక్తి చీరలను రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న సోమవారం పంపిణీ చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు ప్రభుత్వం నాణ్యమైన చీరలు అందిస్తుందన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో నాసిరకం చీరలను మహిళలకు పంపిణీ చేసి మోసం చేసిందన్నారు. మహిళల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.