MBNR: చిన్నచింతకుంట మండలం పర్దిపూర్ గ్రామానికి చెందిన కమలన్న ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ మేరకు విద్యుత్ శాఖ నుంచి ప్రమాద బీమా కింద మంజూరైన రూ. 4 లక్షల 50 వేల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు సోమవారం కమల్ అన్న సతీమణి పుష్పకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.