WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందులో ఓ వీధి కుక్క సైరవిహారం చేసింది. ఈ దాడిలో బిల్లా రాజు, పాల యాదగిరి, శేఖర్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వరంగల్ MGM ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.