SRCL: సమస్యల పరిష్కారం కోసం సెస్ (CES) ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వేములవాడ ప్రాంతానికి చెందిన అసిస్టెంట్ హెల్పర్లు రాంబాబు, మల్లేష్, మల్లేశం, మధు, అనిల్ తదితరులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సిరిసిల్లలో ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి తరలి వెళ్లారు. ఉద్యోగులందరూ ధర్నాలో పాల్గొని విజయం సాధించాలని అన్నారు .