ప్రకాశం: చీమకుర్తి మండలం బండ్లమూడి ఘటనలో దెబ్బతిన్న బాధితులకు న్యాయం చేస్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్ తెలిపారు. సోమవారం బండ్లమూడిలో ఆయన పర్యటించారు. ఘటనకు సంబంధించిన వివరాలను బాధితుల నుంచి ఆరా తీశారు. బాధితుల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.