NLR: మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం నెగ్గితే తర్వాత మేయర్ ఎవరనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. స్రవంతి ST సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలన్న అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోంది. అదే జరిగితే 53వ డివిజన్ కార్పొరేటర్ సుజాత, 5వ డివిజన్ కార్పొరేటర్ రవిచంద్రకు అవకాశం ఉంటుంది.