KNR: సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు మారుపాక తిరుపతి ఆధ్వర్యంలో ‘ఇందిరా మహిళా శక్తి’ చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళా అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాక్స్ మాజీ ఛైర్మన్ రాజిరెడ్డి పాల్గొన్నారు.