SRD: కాంగ్రెస్ అధిష్ఠానం అన్ని జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించినప్పటికీ సంగారెడ్డి DCC అధ్యక్షుడి నియామకం పెండింగ్లో ఉంచడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ముగ్గురు కీలక నేతలు పోటీలో ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఉజ్వల్ రెడ్డి నారాయణ, ఖేడు చెందిన నగేష్ షెట్కార్, ఖేడ్ MLA సంజీవరెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రధానంగా పోటీలో ఉన్నారు.