BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో సర్వే నంబర్ 391, 1652, 1653లో భూములు కలిగి ఉన్న రైతులకు గత 30 ఏళ్లుగా పట్టాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు భరోసా, బ్యాంక్ రుణాలు సహా ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. పలుమార్లు ఈ సమస్య పై అధికారులకు విన్నవించుకున్న స్పందించడం లేదు. అధికారులు స్పందించి తమకు పట్టాలు మంజూరు చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.