గౌహతి వేదికగా దక్షణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తడబడుతోంది. టీ బ్రేక్ సమయానికి 102 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో 387 పరుగులు వెనుకబడి ఉంది. పంత్ (6*), జడేజా (0*) క్రీజులో ఉన్నారు. జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 22, సాయి సుదర్శన్ 15 పరుగులు చేశారు. ధ్రువ్ జురెల్ డకౌట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్ 2 వికెట్లు పడగొట్టాడు.