TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 25న మంగళవారం పంచమి తీర్థం జరగనుంది. లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో టీటీడీ, పోలీస్ శాఖ భద్రత కట్టుదిట్టం చేసింది. టీటీడీ విజిలెన్స్ 600 మంది, స్కౌట్ అండ్ గైడ్స్ 200 మంది, ఎన్ సీ 200 మంది, శ్రీవారి సేవకులు 900 మంది, పోలీస్ సిబ్బంది 1600 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.