KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి 8 గ్రాములు బంగారు చైను విరాళంగా వచ్చిందని మఠం మేనేజర్ వెంకటేష్ జోషి తెలిపారు. విజయవాడకు చెందిన లాయర్ దుర్గంపూడి వేణుగోపాల్ రెడ్డి, సుధారాణి దంపతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. విరాళం ఇచ్చిన దాత కుటుంబానికి శ్రీ మఠం అధికారులు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు.