KDP: ఖాజీపేట(M) దుంపలగట్టు దళితవాడలో పారిశుధ్య సమస్య తీవ్రంగా వేధిస్తుంది. రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని, మురుగు కాలువలు లేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. చిన్నపాటి వర్షం వచ్చినా వర్షపు నీరు రోజుల తరబడి నిల్వ ఉంటుందని, దీంతో దోమలు అభివృద్ధి చెంది జ్వరాలు సోకుతున్నాయన్నారు. మురుగునీటి సమస్య పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరారు.