SRPT: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం మునగాల మండల కేంద్రంలోని ఊరు చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉచిత చేప పిల్లల పథకం మత్స్య వృత్తిదారులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.