SRD: దోమడుగు గ్రామంలో ఓ పరిశ్రమ వల్ల వాయు కాలుష్యం, వ్యర్థ జలాల విడుదల, భూగర్భ జలాల కాలుష్యం తీవ్రస్థాయికి చేరిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 3 మున్సిపాలిటీ ప్రాంతాల గ్రామస్తులు ఐక్యతగా నిరసనకు సిద్ధమయ్యారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణం ప్రమాదంలో పడుతున్న దృష్ట్యా, కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ పిలుపు మేరకు మంగళవారం నిరసన తెలుపనున్నారు.