MDK: నిజాంపేట మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, నార్లాపూర్ మాజీ సర్పంచ్ రావిపల్లి అమరసేనారెడ్డిని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ పరామర్శించారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న అమరసేనారెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.