SRPT: మోతే మండలం విభలపురం ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. పాఠశాలలో 40 మంది విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చదువుకుంటున్నారు. పైకప్పు నుంచి పెచ్చులూడి పడతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. తరగతి గదులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, కొత్త భవనం నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.