SRD: బొంతపల్లి వీరభద్ర స్వామి వారి ఆలయం ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న రాజగోపురం స్లాబ్ పనులను సోమవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్, ఆలయ కమిటీ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి తదితరులు ఉన్నారు.