MDK: తూప్రాన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆదివారం ఆర్డీవో జయచంద్ర రెడ్డి సమక్షంలో డివిజన్లోని సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. సర్పంచుల రిజర్వేషన్లు ముందే ఖరారు కాగా, రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో తూప్రాన్, మనోహరాబాద్, వెల్దుర్తి, మాసాయిపేట, చేగుంట, నార్సింగి మండలాల మహిళా రిజర్వేషన్లు రాజకీయ పార్టీల సమక్షంలో డ్రా పద్ధతిలో ఖరారు అయ్యాయి.