GNTR: తెనాలి రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్‌గా షేక్ నాయబ్ రసూల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2006 బ్యాచ్‌కు చెందిన నాయబ్ రసూల్ గుంటూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లో పని చేశారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా ఐటీ విభాగం నుంచి బదిలీపై తెనాలి సర్కిల్ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన సీఐ ఉమేష్ రేంజ్ వీఆర్‌కు బదిలీ అయ్యారు.