KDP: కడప శివారులోని వాటర్ గండి వద్ద ఆదివారం రీల్స్ చేయడానికి వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ముగ్గురు నీటిలో కొట్టుకుపోయిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అక్కడివారు ఒకరిని కాపాడగా, కె. నరేష్(18), పి. రోహిత్ కుమార్(16) సుడిగుండాల్లో చిక్కుకుని గల్లంతయ్యారు. ఇవాళ ఉదయం గజ ఈతగాళ్లు వారి మృతదేహాలను బయటకు తీశారు.