సత్యసాయి: గుమ్మగట్ట మండలం, బేలోడు గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి వారి రథోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం వైసీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి పాల్గొన్నారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆయన రథోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో స్థానిక సర్పంచ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.