NRPT: మద్దూరు మండల కేంద్రంలో రైతులు వరి ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి స్థలం లేక రోడ్డుపై ఆరబెడుతున్నందున వాహనదారుల రాకపోకలకు సమస్యగా మారింది. రోడ్డుకు ఒకవైపు వరి ధాన్యం ఉండడంతో మరోవైపు వాహన రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. అలాగే రాత్రి సమయంలో రోడ్డుపై వాహన రాకపోకలకు ఇరుకుగా ఉందన్నారు. చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.