W.G: మొగల్తూరు గుంట పల్లవ పాలెం గ్రామ శివారులో ఆదివారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసినట్లు ఎస్సై వై. నాగలక్ష్మీ తెలిపారు. ఈ దాడిలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి రూ. 9,620 నగదు, 52 పేక ముక్కలు, ఆరు ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.