HYD: నార్సింగిలో ఫేక్ సర్టిఫికెట్ల రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. టెన్త్ నుంచి డిగ్రీ వరకు నకిలీ పత్రాలు తయారు చేసి, విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా భారీగా నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ. 50 వేల నుంచి లక్ష వరకు నకిలీ సర్టిఫికెట్లను అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇటీవల హైటెక్స్‌లోనూ ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం బయటపడింది.