KMM: గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసిందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు విమర్శించారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. నిన్న గోకినపల్లిలో ఆయన మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.