SKLM : వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర తీరం సమీప తోటలో ఆదివారం జూదమాడుతున్న 12 మందిని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ గ్రామీణ సీఐ తిరుపతి తెలిపారు. వారి నుంచి రూ.11,300 నగదు స్వాధీనం చేసుకున్నమన్నారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.