MBNR: మహిళల సాధికారత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం చిన్న చింతకుంట మండల కేంద్రంలో మహిళలకు చీరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబం బాగుపడుతుందని, తమ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తోందని తెలిపారు.