W.G: మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్లో ఆదివారం సముద్ర స్నానం చేస్తూ ఒక యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. ఏలూరు కొత్తపేటకు చెందిన మునగాల మోహన్ సాయి గణేష్ (19) తన మిత్రులతో కలిసి సముద్ర అలల్లో స్నానం చేస్తూ అలల ఉధృతికి ప్రమాదవశాత్తు లోనికి కొట్టుకు వెళ్లి గల్లంతయ్యాడు. సోమవారం గణేష్ మృతదేహం మోళ్లపర్రు బీచ్లో దొరికిందని స్థానికులు తెలిపారు.