TG: CJIగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారోత్సవం కోసం CM రేవంత్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. కార్యక్రమం అనంతరం నేరుగా హైదరాబాద్ రానున్న CM, అక్కడి నుంచి కొండగల్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు గ్రీన్ ఫీల్డ్ కిచెన్‌కు శంకుస్థాపన చేస్తారు. హకీంపేట సైనిక్ స్కూల్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.