KDP: దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా, తరువాత 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ఆవర్తనం వల్ల మంగళవారం నాటికి నైరుతి బంగాళాఖాతం–శ్రీలంక వద్ద మరో అల్పపీడనం ఏర్పడవచ్చు. కడప జిల్లాలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశంద ఉందని పేర్కొంది.