NGKL: అమ్రాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సోమవారం ఉదయం 11 గంటలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ, సీబీఎం ట్రస్ట్ ఛైర్ పర్సన్ డాక్టర్ అనురాధ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. అమ్రాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామాల మహిళలు పాల్గొనాలని కోరారు.